‘గూఢచారి’కి మహేష్ ప్రశంస


సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదలకు ముందే ‘గూఢచారి’ సినిమాని చూసేశాడు. సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని సుప్రియా యార్లగడ్డ చెప్పింది. సినిమాలో తన నటన బాగుందంటూ మహేష్ కితాబిచ్చినట్టు తెలిపింది. తాజాగా, మహేష్ ‘గూఢచారి’పై ప్రశంసలు కురిపించారు. ” ‘గూఢచారి’ చిత్రం అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. పట్టున్న కథ, కథనంతో ఆకట్టుకున్నారు. అడవిశేష్ అద్భుత పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ” మహేష్ ట్విట్ చేశారు.