‘రిషి’గా మహేష్ ?


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులని టెన్షన్ పెడుతున్నాడు. ఆయన 25వ సినిమా టైటిల్ ఏంటో ? నేరుగా చెప్పడం లేదు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఐతే, అంతకంటే ముందే సోషల్‌ మీడియా ద్వారా రోజుకో ఆంగ్ల అక్షరాన్ని క్లూగా అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్‌, ఐ, ఎస్‌, హెచ్‌లు బయటకు వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే సినిమా పేరు ‘రిషి’ అయ్యే అవకాశాలున్నాయని మహేష్‌ అభిమానులు భావిస్తున్నారు.

టైటిల్‌ అదేనా? లేదంటే ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర పేరు ‘రిషి’గా నిర్ణయించి, వేరే టైటిల్‌ ప్రకటిస్తారా ? అనేది తేలాల్సివుంది. టైటిల్‌ ఏమిటో తెలియాలంటే మహేష్‌ పుట్టినరోజు ఆగస్టు 9 వరకూ ఆగాల్సిందే. టైటిల్ ‘రిషి’ అయితే.. సినిమాలో మహేష్ పేరు కూడా అదే అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదీగాక, టైటిల్ వేరేది పెట్టిన మహేష్ ‘రిషి’గా కనిపించబోతున్నాడు. మొత్తానికి.. మహేష్ ‘రిషి’గా కనిపించబోవడం దాదాపు ఫిక్స్ అనే చెప్పాలి.

వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. స్టూడెంట్ గా, ఓ అమెరికన్ కంపెనీ సీఈవోగా, రైతుగా మహేష్ కనిపిస్తాడట. సినిమా కూడా బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ స్టయిల్ లో సాగుతుందని చెప్పుకొంటున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.