5ని॥ల పనికి 5లక్షలు తీసుకొందట !

‘ఆర్ఎక్స్ 100’ సినిమా కోసం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పుచ్చుకొన్న పారితోషికం ఎంతో తెలుసా.. ? కేవలం రూ. 6లక్షలు మాత్రమే. ఐతే, ఈ సినిమా విడుదల తర్వాత పాయల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఆఫర్లు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలు ఈ బోల్డ్ బ్యూటీ వైపు చూస్తున్నారు. ఈ క్రేజ్ ని పాయల్ రాజ్ పుత్ బాగానే వాడుకొంటోంది. రేటుని పెంచేసింది. ఎంతలా అంటే.. 5 నిమిషాలకు 5లక్షలు తీసుకొనేలా.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీ తెలుగు కామెడీ అవార్డ్స్ వేడుకకు పాయల్‌ను కూడా ఇన్వైట్ చేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో స్టేజ్ అప్పియరెన్స్ ఇచ్చినందుకుగాను రూ. 5 లక్షలు చార్జ్ చేసిందట. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక, జీకామెడీ అవార్డ్స్ వేడుకకు లైట్ పింక్ కలర్ డ్రెస్సులో పాయల్ అదిరగొట్టిన సంగతి తెలిసిందే.

ఈ బోల్డ్ హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ తో జతకట్టే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తనలో మహేష్ భార్య నమ్రత లక్షణాలున్నాయని చెప్పి.. ఆకర్షిం చే ప్రయత్నం చేస్తోంది పాయల్. ఈ ఆకర్ణణ మహేష్ పై ఏ మేరకు పని చేస్తుందన్నది చూడాలి. ఇక, ఇప్పటికే తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న బెల్లకొండ సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపికైంది పాయల్. మరో హీరోయిన్ గా కాజల్ నటించనుంది.