నేడు బస్’లు బంద్
దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు నేడు (మంగళవారం) బంద్ పాటిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఒక రోజు సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలూ నిర్ణయించాయి. విధులను బహిష్కరించాలని అధిక శాతం కార్మిక సంఘాలు నిర్ణయించటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఈ బంద్ ప్రభావం నగర ప్రజలపై విపరీతంగా ప్రభావం చూపనుంది. మరోవైపు, ఈ బంద్ ను అవకాశంగా తీసుకొని ప్రయివేటు వాహనదారులు దండుకొంటున్నారు. డబుల్, ట్రిపుల్ రేటు తీసుకొంటున్నట్టు సమాచారమ్.