సచిన్ క్రికెట్‌ అకాడమీ ప్రారంభం


భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ క్రికెట్‌ అకాడమీ మొదలైంది. ఐతే, అది మనదేశంలో కాదు.. ఇంగ్లాండ్ లో. ఇంగ్లాండ్‌ లో ‘తెందుల్కర్‌ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ’ ప్రారంభమైంది. కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో కలిసి సచిన్ ఈ అకాడమీని నడపనున్నాడు. ఈ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి చిన్నారులకు పాఠాలు షురూ చేశారు. 9 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఈ అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడమే తమ అకాడమీ ధ్యేయమని సచిన్‌ తెలిపాడు.ఇలాంటివి మనదేశంలోనూ ప్రారంభిస్తే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడా పనిలో ఉన్నాడట సచిన్. త్వరలో ముంబయిలోనూ ఈ శిబిరాలు నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐతే, ముందుగా సచిన్ ఈ పనిని భారతదేశంలో ప్రారంభిస్తే.. ఆయన అభిమానులు మరింతగా సంతోషించేవారు.