‘మహర్షి’లో అల్లరి నరేష్ పాత్ర పేరేంటో తెలుసా ?


సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా టైటిల్ ‘మహర్షి’ అని తెలిసిపోయింది. ఇందులో మహేష్ ‘రిషి’ పాత్రలో కనిపించబోతున్నట్టు స్పష్టమైంది. టీజర్ లో రిషి అమ్మాయిలకి సైట్ కొట్టడం కూడా చూసేశాం. రిషిగా మహేష్ బాగున్నాడు. మరీ.. రిషి స్నేహితుడు అల్లరి నరేష్ పాత్ర పేరేంటీ ? ఆయన లుక్ ఎలా ఉండబోతుంది ?? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎలాంటి సస్పెన్స్ లేకుండా అల్లరోడు తన పాత్ర పేరు చెప్పేశాడు. ‘మహర్షి’లో నరేష్ ‘రవి’ పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో తన పాత్ర పేరు రివీల్ చేశాడు అల్లరోడు. “ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి” అని ట్విట్ చేశాడు నరేష్. రిషి, రవిల స్నేహాన్ని చూడాలంటే ‘మహర్షి’ వచ్చే వరకు ఆగాల్సిందే.