ఎన్డీయేదే గెలుపు… రాజ్యసభ ఉపసభాపతిగా హరివంశ్.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఊహించినట్లుగానే ఎన్‌డీఏ ఖాతాలోకి వెళ్లింది. ఎన్‌డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ బి.కె.హరిప్రసాద్ బరిలోకి దిగగా గురువారం ఉదయం రాజ్యసభలో పోలింగ్ జరిగింది. 26 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ లో మొత్తం 232 సభ్యులు పాల్గొనగా, హరివంశ్ కు మద్దతుగా 125ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బికె హరిప్రసాద్ కు మద్దతుగా 105 ఓట్లు వచ్చాయి. సభలో ఉండి ఇద్దరు సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఎక్కువ ఓట్లు సాధించుకున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణసింగ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఎంపికయ్యారు.