మహేష్’కు కేటీఆర్ విషెస్


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. తాజాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘సూపర్ స్టార్, స్నేహితుడు మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు కేటీఆర్. దీనిపై మహేష్ ‘థ్యాంక్యూ సర్’ అంటూ రిప్లై ఇచ్చారు.

కేటీఆర్ తో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. మహేష్ ‘భరత్ అను నేను’ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కేటీఆర్ వచ్చారు. ఈ సినిమాపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు విషెస్ చెబుతూ.. మహేష్ ట్విట్ చేశారు. ఇదీగాక, మహేష్-కేటీఆర్ ఎప్పుడు కలిసిన అది స్పెషల్ గా నిలుస్తుంది. బహుశా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఐతే పొలిటికల్ సూపర్ స్టార్ కేటీఆర్ కావడమే కారణం కావొచ్చు.

ఇక, అభిమానులకు మహేష్ పుట్టినరోజు కానుకని అందజేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన 25వ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మహర్షి’ టైటిల్ ని పెట్టారు. సినిమాలో మహేష్ రిషి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిసింది. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.