నితిన్ పెళ్లిపై నెగటివ్ టాక్ !


నితిన్-రాశీఖన్నాలకు థియేటర్స్ లో పెళ్లి జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ విగ్నేశ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. భారీ అంచనాల మధ్య ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈరోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఐతే, పెళ్లి తంతుతో తెర కళకళలాడుతున్న అది ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా సాగుతుందన్నది టాక్.

సందు దొరికినప్పుడల్లా స్కూల్ మాస్టారులా నితిన్ క్లాసులు పీకాలని చూస్తున్నాడట నితిన్. ఇక, ఐస్ క్రీమ్ వైపు ఆశగా చూసే పాపాయిలా నితిన్ ని తినేసేలా చూస్తోందట రాశీఖన్నా. ప్రేక్షకుడు మాత్రం థియేటర్ నుంచి ఎప్పుడు బయటపడాలని చూస్గున్నాడంట. సినిమాలో వచ్చే పెళ్లి మంత్రాలు, శాంతాండత డైలాగులు అర్థంకాక ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారమ్.

‘శతమానం భవతి’ లాంటి ఘన విజయం తర్వాత దర్శకుడు శతీష్ విగ్నేశ దర్శకత్వంలో వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఐతే, నితిన్ కళ్యాణం ‘శతమానం భవతి’ అంత గొప్పగా లేదని చెబుతున్నారు. మరీ.. నితిన్ కళ్యాణం ఎలా సాగింది ? అన్నది మరికొద్దిసేపట్లో పూర్తి రివ్యూతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.. మీ టీఎస్ మిర్చి.