బ్రేకింగ్ : నితిన్ పెళ్లి ఫిక్స్


టాలీవుడ్ పెళ్లికానీ ప్రసాదుల్లో నితిన్ ఒకరు. ఇప్పుడీ యంగ్ హీరో పెళ్లిపై బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. నితిన్ కి పెళ్లి ఫిక్సయింది. దీంతో బంధువులు నితిన్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఐతే, ఇదంతా తెర మీద. నితిన్ తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఉదయం పూట ఆట కూడా మొదలైపోయింది. ఫస్టాఫ్ రిపోర్ట్, పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. నితిన్-రాశీఖన్నాల పెళ్లిల పెళ్లి ఫిక్సవడంతో బ్రేక్ ఇచారు. అదేనండీ.. ఇంటర్వ్ వెల్ కార్డ్ వేశారు. దీంతో.. రివ్యూలు అందించేవారు.. బ్రేకింగ్ నితిన్ పెళ్లి ఫిక్సయ్యింది అంటూ.. లైవ్ అప్ డేట్స్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.

‘శ్రీనివాస కళ్యాణం’ కన్నుల పండగ సాగిపోయిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది. తెలుగు సంస్కృతి మరియు వివాహాల ప్రాధాన్యతను గురించి వెంకీతో చెప్పించారు. గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో 20 ఏళ్ళ క్రితం సినిమా మొదలవుతుంది. సినిమాలోని పాత్రలు రాజేంద్రప్రసాద్ తో మొదలయి అన్నపూర్ణ, జయసుధ, నరేష సహా అందరూ ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేయబడుడ్డారు. ప్రారంభం నుంచే తెర కళకళాడిపోతుంది.

రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా నితిన్ చండీగఢ్ లో సింపుల్ గాఎంట్రీ ఇచ్చాడు. రాశి ఖన్నా కాఫీ షాప్ లో పనిచేసే యువతిగా ఎంట్రీ ఇచ్చింది. ఒక బ్యాచిలర్ పార్టీలో నితిన్, రాశిఖన్నా ఒకరినొకరు కలుసుకొంటారు. రాశిఖన్నా, నితిన్ ప్రేమలో పడిపోయింది. నితిన్, రాశి ఇద్దరూ తమ ప్రేమని వాళ్ళ తల్లితండ్రులకు చెప్పేడం. పెద్దలు ఒప్పుకోవడం.. వీరి పెళ్లి ఫిక్సయిపోవడంతో ఇంటర్ వెల్ కార్డు పడిపోయింది. ఎంగేజ్ మెంట్ ఏపీసోడ్, దానికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య సంస్కృతికి సంబంధించి కొన్ని తేడాలు రియలిస్టిక్ గా చూపించారు. పెళ్లి పనులు, సాంప్రదాయ వివాహ వేడుక, హృదయానికి హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో సినిమాని పూర్తి చేశాడు దర్శకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘శ్రీనివాస(డి) కళ్యాణం’ అద్భుత: అన్నది పబ్లిక్ టాక్.