రివ్యూ : శ్రీనివాస కళ్యాణం
చిత్రం : శ్రీనివాస కళ్యాణం
నటీనటులు : నితిన్, రాశీఖన్నా
సంగీతం : మిక్కీ జె మేయర్
దర్శకత్వం : సతీష్ విగ్నేష్
నిర్మాత : దిల్ రాజు
రిలీజ్ డేటు : 09ఆగస్టు, 2018.
రేటింగ్ : 2.75/5
– బొమ్మరిల్లు
– సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
– శతమానం భవతి
ఇవన్నీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రాలు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. దిల్ రాజు బ్యానర్ బ్రాండ్ ని పెంచిన చిత్రాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తుందంటే భారీ అంచనాలు నెలకొనడం సహజమే. ‘శ్రీనివాస కళ్యాణం’పై ఇలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ఈ చిత్రానికి ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ విగ్నేశ దర్శకుడు కావడం.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. అదిరిపోవడంతో నితిన్-రాశీఖన్నాల ‘శ్రీనివాస కళ్యాణం’పై అంచనాలు ఆకాశన్నంటాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఎలా జరిగింది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రాజేంద్రప్రసాద్ ది గోదావరి జిల్లాకి చెందిన సంప్రదాయమైన ఉమ్మడి కుటుం. ఆయన కొడుకు శ్రీనివాస రాజు (నితిన్) చండీగడ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్ చేసే శ్రీదేవి (శ్రీ)తో ప్రేమలో పడుతాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకొంటారు. ఐతే, ఈ క్రమంలో శ్రీ తండ్రి ప్రకాష్ రాజ్ రాజుకు ఓ శరతు పెడతాడు. ఇంతకీ ఆ శరతు ఏంటీ ? దాని కారణంగా దారితీసిన పరిస్థులేంటీ ?? రాజు, శ్రీల వివాహం ఎలా జరిగింది.. ?? అనేది భాగోద్వేగతంతో కూడిన మిగిలిన కథే శ్రీనివాస కళ్యాణం.
ఎలా ఉందంటే ?
గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో 20యేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్-ఆమని పెళ్లి తంతుతో సినిమా మొదలవుతుంది. దీనికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీనివాస రాజుకు బ్యాలంలోనే పెళ్లి పండుగ అనే భావన కలిగినట్టు చూపించారు. దీంతో ఈ తరం కుర్రాడి సంప్రదాయ పెళ్లిపై ఆసక్తి ఏంటీ ? అనే అనుమానాలు కలగకుండా చేశాడు.
చండీగడ్‌లో రాజులో ఆ క్వాలిటీ చూసే శ్రీ అతనితో ప్రేమలో పడుతోంది. ఆ తర్వాత ప్రేమ, రొమాన్స్ అనే విషయాల వైపు వెళ్లి బోర్ కొట్టించకుండా నేరుగా పెళ్లి వైపు తీసుకెళ్లాడు దర్శకుడు. పెద్దలని ఒప్పించి నిశ్చితార్థం, పెళ్లి వేడుకకు రంగం సిద్ధం చేశాడు. ఐతే, కథపై ఆసక్తి పెరిగేలా.. పెళ్లికి ఒప్పుకోవడానికి శ్రీ తండ్రి ప్రకాష్ రాజు పెట్టిన షరతు పనికొచ్చింది. ఆ శరతు ఏంటీ ? దానికి రాజు కట్టుబడి ఉన్నాడా.. ? అన్నది తెలుసుకోవాలనే ఆతృతని కలిగించేలా కథని నడిపాడు. చిరకు బాగోద్వేగ సన్నివేశాలతో పెళ్లి తంతుతో సినిమాని ముగించారు.
చెప్పడానికి ఇంత సింపుల్ గా అనిపిస్తున్నా.. సంప్రదాయ పేరిట దర్శకుడు విగ్నేష్ నితిన్ లో చాలా క్లాసులే పీకాడు. వీలు చిక్కినప్పుడల్లా లెక్చర్లు ఇప్పించాడు. దీనికితోడు పెళ్లి తంతులో వచ్చే మంత్రాలు, ఆ మాటాలు సామాన్య ప్రేక్షకుడు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. తెరపై శ్రీనివాస కళ్యాణం కలర్ ఫుల్ గా సాగినా.. ఆ సినిమా చూసిన ప్రేక్షకుడి మొహాలు అంతగా ఏమీ వెలిగిపోలేదు. ఫలితంగా.. అద్భుత సినిమా అనుకొన్నది కాస్త.. యావరేజ్ సినిమాగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే ?
‘పెళ్లి అనేది ఓ పండగ’.. అనే పాయింట్ ని తీసుకొన్న దర్శకుడు దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ లో ప్రేమ, పెద్దలు ఒప్పుకోవడం.. చక చకా నడిపించేశాడు. సెకాంఢాఫ్ లో ఎమోషన్స్ పండటానికి.. ఒక్కో సీన్ అల్లుకొంంటూ వెళ్లాడు. ఐతే, అందులో కొన్ని ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా ఉన్నాయి.
శ్రీనివాస రాజుగా నితిన్ సెటిల్డ్ గా నటించారు. లవర్ బాయ్‌గా, ఓ ఫ్రెండ్‌గా, కుటుంబ విలువలు తెలిసిన యువకుడిగా, ప్రియురాలి మనసు ఎరిగిన ప్రేమికుడిగా మెప్పించాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో ప్రకాశ్ రాజ్‌తో పోటిపడే మరీ నటించారు. నితిన్ ఎంతో అనుభవం నటుడిలా కనిపించాడు. రాశీఖన్నా అందం+అభినయంతో ఆకట్టుకొంది. రొమాంటిక్ సీన్స్ లో జీవించింది. నితిన్ ని కసిగా చూస్తూ తినేసేలా కనిపించింది. ‘తొలిప్రేమ’ తర్వాత ఆమెకు దక్కిన మరో మంచి పాత్ర శ్రీ అని చెప్పవచ్చు.
నితిన్‌కు మరదలిగా నటించిన నందిత శ్వేత నటన బాగుంది. ఈ సినిమాకి ప్రకాశ్ రాజ్, జయసుధ మరోసారి వెన్నుముకగా నిలిచారు. సితార, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తమ పాత్రలతో అదనపు బలంగా మారారు. ఎమోషన్ ఉన్న ప్రతీ ఫ్రేమ్‌లో ఈ నలుగురే కనిపిస్తారు.
సాంకేతికంగా :
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పెళ్లి వాతావరణాన్ని, కోనసీమ అందాలను అద్భుతంగా చూపించారు. మిక్కి జే మేయర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండు బాగున్నాయి. శ్రీనివాస కల్యాణం థీమ్ సాంగ్ అదిరిపోయింది. ఎడిటింగ్ ఓకే. దిల్ రాజు బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెర పండగ జరిపించారు. పెళ్లి పండగ కన్నుల పండగగా అనిపించింది.
బాటమ్ లైన్ :
ఈ కళ్యాణం చూడాలంటే.. కావాల్సిన ఓపిక కూడా ఉండాలి.
రేటింగ్ : 2.75/5