వారిద్దరిదీ కన్వినెంట్ గేమ్..!
బీజేపీ, వైసీపీ బంధంపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఫైర్ అయ్యారు. రాఫెల్ స్కాంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని , పదే పదే దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ మోడీ చేసిన అవినీతిపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ స్కాంలో జరిగింది కేవలం అవినీతి మాత్రమే కాదని, దేశద్రోహమని ఆయన ఆరోపించారు. 2007 లో 226 యుద్ద విమానాలు 42 వేల కోట్లతో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే, ప్రధాని మోడి 36 యుద్ద విమానాలు 58 వేల కోట్లతో కోనుగోలు ఒప్పందం చేసుకోవడం పెద్ద అవినీతి అని ఆయన అన్నారు. బిజెపి-వైసిపి బంధం పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయట పడిందని, వారిద్దరిదీ కన్వినెంట్ గేమ్ గా ఆయన అభివర్ణించారు.