ఎన్నాళ్లో మోసిన బంధం..!!
ద్రవిడ సూరీడు, కళైంగర్ కరుణానిధి మరణించినా ఆయన కుటుంబ సభ్యులకంటే ఆయన్ను మోసిన బంధం ఒకటి ఇంకా ఆయన్ను గుర్తు చేస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా అంటిపెట్టుకుని ఉన్న కుర్చీ ఇప్పుడు వెలవెలబోతోంది. కరుణ కోసం అత్యంత ఆధునికక సదుపాయాలతో తయారు చేయించారు ఆ కుర్చీని. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా కరుణానిధి ఆ కుర్చీలోనే ఆసుపత్రికి వెళ్లేవారు. గత నెలలో మాత్రం ఆయన్ని ఆ కుర్చీపై కాకుండా అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకుంటుడటంతో ఆ వీల్ చైర్ ని తెప్పించి, దానిపై ఆయన్ని కూర్చోబెట్టి ఫిజియోథెరపీ కూడ ఇచ్చారట.
కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించి ఆయన మరణించడంతో ఇన్నాళ్లుగా అధినేత బరువును మోసిన కుర్చీ ఇప్పుడు మూలనపడింది. తిరిగిరాని లోకాలకు తరలిపోయిన అధినేత కోసం మౌన రోదనలో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ కుర్చీ ఇప్పుడు గోపాలపురంలోని కరుణ నివాసంలో ఓ మూలన పడిఉంది. నిజంగా కరుణతో ఈ కుర్చీది ఎన్నాళ్లో మోసిన బంధం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.