హలో గురూ.. నువ్వు నాకు నచ్చావ్ !
హలో గురూ.. నువ్వు నాకు నచ్చావ్ అంటున్నాడు రామ్. ఆయన తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ జతకట్టనుంది. ఈ సినిమా వెంకీ ‘నువ్వు నాకు నచ్చావ్’ లైన్ తో తెరకెక్కుతోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ గుర్తుంది కదా ? నిశ్చితార్థమై, పెళ్లికి రెడీగా ఉన్న ఓ అమ్మాయి ఇంట్లో అడుగుపెడతాడు హీరో. ఆమెను ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడన్నదే కథ. `హలో గురు` కూడా అలానే ఉంటుందట. ఐతే, ఇందులో పందెం కాన్సెప్ట్ ని జోడించారంట.
హీరోయిన్ తండ్రితో వేసిన పందెం కోసమే.. హీరోయిన్‌ని ప్రేమలో దించడానికి ప్రయత్నిస్తాడట హీరో. అందులో ఎలా సక్సెస్ అయ్యాడు ? అనేదే కథ. ఈ తరహా కథలు తెలుగు తెరకు మామూలే. ఐతే, ట్రీట్ మెంట్ కాస్త కొత్తగా ప్లాన్ చేసుకొన్నాడట దర్శకుడు. త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ‘సినిమా చూపిస్తా మావ’, ‘ఎంసీఏ’ సినిమాల్లో కొత్తలే కొత్తదనమేమీ లేకున్నా ట్రీట్ మెంట్ తో ఆకట్టుకొన్నాడు. కామెడీని ఆయన బాగానే వర్కవుట్ చేస్తారు. హలో గురూ.. లోనూ అది వర్కవుట్ అయితే విజయం దక్కినట్టే.. !