‘గీత గోవిందం’ సినిమా లీక్.. నిందితుడు అరెస్టు !

విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమా విడుదలకు ముందే లీకవ్వడం చిత్రబృందాన్ని షాక్ గురిచేసింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ గుంటూరులో విద్యార్థుల సెల్ ఫోన్స్ లో దర్శనమివ్వడంతో.. లీకైన విషయం వెలుగులోకి వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు ‘గీత గోవిందం’ లీకు కేసుని అత్యంగ వేగంగా చేధించారు. ఇప్పటికే నిందితుడు పడవల రాజేష్ ను అరెస్టు చేశారు.

చీరాలకు చెందిన పడవల రాజేష్ హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో డేటా డిజిటల్ బ్యాంకు అడ్మిన్ గా పనిచేస్తున్నాడు. ఎడిటింగ్ నిమిత్తం ఇచ్చిన హార్డ్ డిస్క్ లోని డేటాను తన ల్యాప్ టాప్ లోకి కాపీ చేసుకున్నాడు. ఈ సినిమా వీడియోను పెన్ డ్రైవ్ ల ద్వారా తన స్నేహితులకు, అదే విధంగా, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు రాజేశ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి 3 ల్యాప్ టాప్ లు, 3 పెన్ డ్రైవ్ లు, 3 హార్డ్ డిస్క్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన మరో ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.