విరాట్ కోహ్లీగా దుల్కర్ .. !!


కేరళలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అక్కడ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమ్మిళ్ లోనూ ఆయనకు అభిమానులున్నారు. చెలియా, మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.. ఈ యంగ్ హీరో. ఇప్పుడు ‘జోయా ఫ్యాక్టర్’ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అంజు చౌహాన్‌ నవల ‘ది జోయా ఫ్యాక్టర్‌’ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. అభిషేక్ శర్మ దర్శకుడు. దుల్కర్ కి జంటగా సోనమ్‌ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు.

ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుందట. సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌.. విరాట్‌ కోహ్లీ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్‌ యువతి భారత్‌ జట్టును కలవడం.. ఆపై వరల్డ్‌కప్‌ గెలవడం స్టోరీ లైన్ గా చెబుతున్నారు. మరి.. కోహ్లీగా దుల్కర్ ఏ రేంజ్ లో రాణిస్తాడన్నది తెరపై చూడాలి.