తప్పుని ఒప్పుకొన్న దిల్ రాజు
‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు తప్పుని ఒప్పేసుకొన్నారు. విడుదలకు ముందు సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పాం. దీని వల్ల ప్రేక్షకులు మరీ ఎక్కువ ఊహించుకుని డిస్సపాయింట్ అయ్యారని చెప్పారు. ఐతే, సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇప్పుడు మళ్లీ జనం థియేటర్ వైపు వస్తున్నారు.
గురువారం సినిమా విడుదలయితే శుక్రవారం కలెక్షన్లు డల్ అయ్యాయి. తొలిరోజు వచ్చిన నెగటివ్ టాక్ ప్రభావం తర్వాతి రోజుపై గట్టిగానే పడింది. శనివారం మార్నింగ్ షో కూడా అలాగే వున్నాయి. ఐతే, శనివారం మాట్నీ, ఫస్ట్ షో, సెకెండ్ షో లలో పికప్ కనిపించింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఆదివారం కూడా బాగానే వుండేలా వుంది. ఈ లెక్కన వీకెండ్ ఆశాజనకంగా ఉండనుంది.
అది సినిమాని బయటపడేస్తుందా.. ? అంటే చెప్పలేం. కాకపోతే.. ఈ లెక్కలు దిల్ రాజుకు కాస్త ఆశ కలిగించి వుంటాయి. ఏదైనా కొత్తగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తే కొంత మేరకు కోలుకోవచ్చని దిల్ రాజు ప్లాన్ లా కనిపిస్తోంది.