‘గీత గోవిందం’ లీకుపై విజయ్ స్పందన

ఇవాళ టాలీవుడ్ ని షేక్ న్యూస్ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీదున్న టాలీవుడ్ క్రేజ్ సినిమాలన్నీ పైరసీ అయ్యాయని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ లో భాగంగా ఓ ఎడిటర్ ని అరెస్ట్ చేయగా.. ఆయన నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్ లో మహర్షి, అరవింద సమేత, గీత గోవిందం, టాక్సీవాలా.. సినిమాలకు సంబంధించిన రా పుటేష్ ఉంది. ఇది పోలీసులని, టాలీవుడ్ ని షేక్ కి గురి చేస్తోంది.

ఈ హార్డ్ డిస్క్ లో విజయ్ దేవరకొండకు నటించిన రెండు సినిమాలున్నాయని తెలిసిందే. ఈ ఆగస్టు 15కి ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాలోని కొన్ని సీన్స్ లీకయ్యాయి. దీంతో విజయ్ నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ‘నేను చాలా నిరాశకు లోనవుతున్నా. హర్ట్ అయ్యా. ఒకసారి కోపం వస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తుంది’ అని ట్వీట్ చేశాడు విజయ్. లీకుల విషయం తెలిసే విషయం ఈ ట్విట్ చేశాడని అర్థమవుతోంది.