‘గీత గోవిందం’ బిజినెస్.. ఏ ఏరియాలో ఎంత ?
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న ‘గీత గోవిందం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారమ్.
ఏరియాల వారీగా చూస్తే.. నైజాం రూ. 4 కోట్లు, సీడెడ్ రూ. 2 కోట్లు, నెల్లూరు రూ. 0.40 కోట్లు, కృష్ణ రూ. 0.80 కోట్లు, గుంటూరు రూ. 0.90 కోట్లు, వైజాగ్ రూ. 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 0.70 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 0.60 కోట్లు, కర్ణాటక రూ. 1.30 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా రూ. 0.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.70 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయినట్టు తెలిసింది. ప్రస్తుతం విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా ఏ మాత్రం బాగున్నా.. వారంలోనే బడ్జెట్ తిరిగి రావోచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. విజయ్ సరసన రష్మిక మందన జతకట్టింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు నిర్మించారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.