ఎంపీ శివప్రసాద్’పై తమన్నా ఫిర్యాదు
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పై తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. విభిన్న వేషాధారణల్లో పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలపడం ఎంపీ శివ ప్రసాద్ ప్రత్యేకత. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నిరసన సమయంలో ఎంపీ చాలా గెటప్స్ లోనే దర్శణమిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల ట్రాన్స్ జెండర్ వేషంలో సందడి చేశారు. ఆ హావాభావాలతో.. మీడియా ముందు కాస్త అతియే చేశాడు.
ఎంపీ వ్యవహార శైలి తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన ఆందోళనలో భాగంగా మహిళ వేషధారణలో ఉన్న శివప్రసాద్.. ట్రాన్స్ జెండర్ అని చెప్పడం దారుణమని అన్నారు. తాము మహిళలతో సమానమని… శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.