రాహుల్ కు కేటీఆర్ ‘ట్వీట్’ కౌంట‌ర్..!

అవినీతికి అడ్డాగా కేసీఆర్ కుటుంబం మారిందని, అప్పుడు అవినీతి అని పిలిస్తే ఇప్పుడు రీడిజైన్ అని పిలుస్తున్నార‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే రాహుల్ పంచ్ ల‌కు, విమ‌ర్శ‌ల‌కు ట్విట్ట‌ర్ లో కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గ‌త రెండు రోజులుగా రాహుల్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌న్నింటిపై ఆయ‌న స్పందించారు.

అవినీతి గురించిమాట్లాడే ముందు రాహుల్ త‌న వెన‌కున్న వారిని చూసుకోవాల‌ని, వారిలో సగానికిపైగా అవినీతి కేసులున్నవారేన‌ని, బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారే అంటూ ట్వీట్ట‌ర్ లో కౌంట‌ర్ ఇచ్చారు కేటీఆర్. ఏ ఫ‌ర్ ఆద‌ర్శ్, బీ ఫ‌ర్ బోఫోర్స్, సీ ఫ‌ర్ కామ‌న్ వెల్త్ .. ఇలా ఇంకా చెప్ప‌మంటారా అంటూ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. మీడియా స్వేఛ్చపై కాంగ్రెస్ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని, ఎమ‌ర్జెన్సీ లో ఇందిరాగాంధీ చేసిందేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రాజెక్టుల పురోగ‌తిపై కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ లో విమ‌ర్శించారు