రేవంత్ స్పీచ్ పై రాహుల్ ఆస‌క్తి..!!

స‌రూర్ న‌గ‌ర్ కాంగ్రెస్ నిరుద్యోగ గ‌ర్జ‌న స‌భ‌లో సీఎం కేసీఆర్ కు రేవంత్ ఓ రేంజ్ లో ఛాలెంజ్ విసిరారు. ర‌క్తం ఏరులై పారినా స‌రే త‌మ పోరాటం ఆగ‌దంటూ భావోధ్వేగంతో ప్ర‌సంగించారు రేవంత్. రేవంత్ స్పీచ్ ప్రారంభ‌మ‌వుతుంద‌న‌గా స‌భ‌కు హాజ‌రైన జ‌నం నుంచి వ‌చ్చిన రెస్పాన్స్, స్లోగ‌న్స్,కేరింత‌ల‌ను రాహుల్ ఆస‌క్తిగా గ‌మ‌నించారు. రేవంత్ మాట్లాడుతున్న‌ప్పుడు జ‌నం నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను రాహుల్ తిల‌కించారు. సీఎం కేసీఆర్ కు త‌మ బ‌ల‌మేంటో చూడాలంటూ రేవంత్ ఛాలెంజ్ విసిరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రజాబ‌లం తెలిసిందా.. అంటూ స‌భావేదిక‌పైనుంచే రాహుల్ ముందే సీఎం కు స‌వాల్ చేశారు రేవంత్. తాము ఎక్క‌డ స‌భ‌నిర్వ‌హించాలో సీఎం చెప్పాల‌ని, సింగ‌రేణిలోనా, ప‌రేడ్ గ్రౌండ్ లో పెట్ట‌మంట‌వా అంటూ ప్ర‌శ్నించారాయ‌న‌. అమ్మ‌, బొమ్మ అని సోనియా గాంధీ అవ‌మానించిన మంత్రి కేటీఆర్ ను వ‌ద‌ల‌మ‌ని, కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోరాడుదామంటూ పిలుపునిచ్చారు రేవంత్. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ అయితే, ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుంది కేసీఆర్ కుటుంబమ‌ని దుయ్య‌బ‌ట్టారు.