అవినీతిని ఇప్పుడు రీడిజైన్ అంటున్నారు..! కేసీఆర్ పై రాహుల్ పంచ్..!!

స‌రూర్ న‌గ‌ర్ నిరుద్యోగ‌, విద్యార్థి గ‌ర్జ‌న స‌భ‌లో అటు ప్ర‌ధాని మోదీ, ఇటు తెలంగాన సీఎం కేసీఆర్ పై రాహుల్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన పోరాటంలో అసువులు బాసిన అమ‌ర‌వీరుల‌కు ఆయ‌న నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు తెలంగాణ కోసం క‌న్న క‌ల‌లు గొప్ప‌వ‌ని ఆయ‌న అన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయని, అవి భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్ వాగ్ధానాల‌న్నీ అబ‌ద్ధాల‌ని తేలిపోయింద‌ని రాహుల్ అన్నారు. కేసీఆర్ వాగ్దానాలన్నీ అబద్ధాలు అని తేలింది..ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయ‌న అన్నారు.

తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌న్నీ కాంగ్రెస్ హ‌యాంలోనే ప్ర‌తిపాదించిన‌వ‌ని అన్నారు రాహుల్. అంబెద్క‌ర్ పేరు మీద ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చాడ‌ని, ఒక్క‌టే దెబ్బ‌కు 38వేల ప్రాజెక్టు ల‌క్ష కోట్ల‌కు పెరిగిపోయంద‌ని రాహుల్ చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సీతారామ ప్రాజెక్టు అంటున్నార‌ని ఎద్దేవా చేశారు. 2500కోట్ల ప్రాజెక్టు 12000కోట్లు అయింద‌న్నారు. ఒక‌ప్పుడు అవినీతి అనేవార‌ని, కానీ ఇప్పుడు రీడిజైన్ అంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. రీడిజైన్ లో కేసీఆర్ సిద్ధ‌హ‌స్తుడ‌ని ఎద్దేవా చేశారు రాహుల్. ఢిల్లీ లో మోడీ, ఇక్కడ కేసీఆర్ అట్లానే రీ డిసైన్ చేస్తున్నారన్నారు.