ఆ సమాధానంతో సీఎం కు కౌంటర్ ఇచ్చిన ఉత్తమ్.. !
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగభృతి అందిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మాయమాటలు మాటలు చెప్పిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించారు. అసలు నిరుద్యోగులను ఎలా నిర్వచిస్తారంటూ ఎద్దేవా చేసిన సీఎం ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పారు ఉత్తమ్.
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ వద్ద ఉద్యోగం కోసం తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, వారందినీ నిరుద్యోగులుగానే తాము గుర్తిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందులో కనీసం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టం చేశారు. ఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సరూర్ నగర్ సభా వేదిక సాక్షిగా ఆయన సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.