యంగ్ టైగర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో తెలుసా.. ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టద్దో తెలుసా.. ? అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సమేత తారక్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో తెలుసా.. ? అది తెలియాలంటే ‘అరవింద సమేత’ టీజర్ చూడాలి. స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ‘అరవింద సమేత’ టీజర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

అరవింద సమేత టీజర్ అదిరిపోయింది. త్రివిక్రమ్ మాటల పవర్, తారక్ యాక్షన్ పవర్ ఏంటో టీజర్ లో చూపించారు. స్టయిలీష్ గా కనిపిస్తూనే యాక్షన్ లో ఇరగదీశాడు తారక్. సినిమాలో రాయలసీమ స్లాంగ్ లో వచ్చే డైలాగులు అదిరిపోయాయ్. మొత్తంగా.. అరవింద సమేత.. టీజర్ అద్భుత:

‘మందు వేసగ్గి గొంతులో దిగితే ఎట్లుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గ్రాంటిస్తే ఎట్లుంటదో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మ్రోగితే ఎట్లుంటదో తెలుసా?’

‘కట్టబడ్డావా కనికరిస్తానేమో.. వెంటబడ్డావో నరికేస్తాభవో’

ఈ సినిమాలో ఎన్ టీఆర్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. హీరోయిన్ ఈష రిబ్బా కీలక పాత్రలో కనిపించనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్ టీఆర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాథాకృష్ణ నిర్మాత.