‘గీత గోవిందం’ పబ్లిక్ టాక్

విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఉదయం పూట ఆట పడిపోయింది. పబ్లిక్ టాక్ కూడా బయటికొచ్చింది. సినిమా అన్నవరంలో మొదలైంది. హీరోయిన్ నిత్యామీనన్ అతిథి పాత్రలో కనిపించింది. ఆమెతో విజయ్ తన కథని చెబుతుండంతో సినిమా మొదలైంది. ఆ తర్వాత కథ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. గర్ల్స్ కాలేజీలో లెక్చరర్ గా విజయ్ దేవరకొండ కనిపించారు. రష్మికను ఆకట్టుకోవటానికి విజయ్ చేసిన.. కొన్ని విలక్షణమైన సన్నివేశాలను వినోదాత్మకంగా చూపించారు.

ఫస్టాఫ్ రొమాంటిక్ గా సాగింది. విజయ్-రష్మికల కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది. సెకాంఢాఫ్ లో ప్రేమజంట మధ్య అపార్థాలు. అవి తెలగిపోయి.. ఎమోషనల్ సీన్స్.. ఓ టీస్టుతో సినిమా ఆసక్తికరంగా సాగింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ కంప్లీట్ డిఫరెంట్ గా కనబడ్డాడబ్బా. ఐతే, ఆయనలో అదే ఎనర్జి, అదే కసి కనబడింది. మొత్తంగా.. గీత గోవిందం లవ్ స్టోరీ బాగుందని చెబుతున్నారు. ఎక్కడా బోర్ రాకుండా ఎంటర్ టైన్ మిక్స్ చేయడం ప్లస్ అయిందని పబ్లిక్ టాక్.