స్క్రిప్టు రైట‌ర్ల‌తో జాగ్ర‌త్త‌.. రాహుల్ కు హ‌రీష్ సూచ‌న‌..

ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీకి కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి హ‌రీష్. స్క్రిప్టు రైట‌ర్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాహుల్ కు సూచించారు హ‌రీష్. కాళేశ్వ‌రం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో అంచనా వ్య‌యాన్ని 38వేల కోట్ల నుంచి ల‌క్ష కోట్ల‌కు పెంచార‌ని రాముల్ కు స్క్రిప్టు రైట‌ర్లు చెప్పార‌ని హ‌రీష్ ఎద్దేవా చేశారు. ప్రాణ‌హిత చేవెళ్ల తొలి జీవో 17వేల కోట్లకు జారీ చేశార‌ని వారు మ‌రిచిపోయారని ఆయ‌న విమ‌ర్శించారు. ఏడాది వ్య‌వ‌ధిలోనే క‌నీసం ప్రాజెక్టు ప‌నులు మొద‌లుపెట్ట‌క‌ముందే 2008లో 38వేల కోట్ల‌కు, 2010లో 40వేల కో్ట్ల‌కు డీపీఆర్ సిద్ధం చేశార‌ని చెప్పారు. ప్రాజెక్టు వ్య‌యం ఆవిధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్ప‌గ‌ల‌రా అంటూ ప్ర‌శ్నించారు.

ఈ విష‌యం రాముల్ గాంధీ స్క్రిప్టు రైట‌ర్ల‌కు తెలియ‌దా అంటూ హ‌రీష్ విమ‌ర్శించారు. రీడిజైన్ చేసిన కాలేశ్వ‌రం ప్రాజెక్టు డీపీఆర్ ను సీడ‌బ్య్లూసీ ఆమోదించింద‌ని, అన్ని అనుమ‌తుల‌ను కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలోనే ఇచ్చింద‌ని చెప్పారు. మ‌న దేశంలో నీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి సీడ‌బ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ అని, జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అది అనుబంధ‌మ‌ని తెలిపారాయ‌న‌. అలాంటి అత్యున్న‌త క‌మిష‌న్ విశ్వ‌స‌నీయ‌త‌ను రాహుల్ ఎలా అనుమానిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంబేద్క‌ర్ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్టుగా మార్చింద‌ని రాహుల్ చెప్ప‌డం ఆయ‌న స్క్రిప్టు రైట‌ర్లు ఆయ‌న్ను ఎంత‌గా త‌ప్పుదోవ ప‌ట్టించారో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు ల‌క్ష‌ల ఎ క‌రాల ఆయ‌క‌ట్టుకు నీరందించే అంబేద్క‌ర్ ప్రాణ‌హిత ప్రాజెక్టు అలాగే ఉంద‌ని హ‌రీష్ తెలిపారు.