ఆ విష‌యంలో ప్ర‌భుత్వం అన‌వ‌ర‌స‌ర ప్ర‌తిష్ట‌కు పోతోంది.

శాశన వ్యవస్థలో తొలిసారిగా స్పీకర్ కు కోర్ట్ నోటీస్ లు ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ ఆలోచించాల‌ని టీడీపీ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భాద్యతని, శాసన వ్యవస్థ వారి గుప్పిట్లో ఉండాలన్న భావనలో కేసీఆర్ ఉన్నారని ఆయ‌న విమ‌ర్శించారు. అప్పీల్ చేసే ఉద్దేశ్యం ఉంటే 60రోజుల ముందే ఎందుకు వెళ్లలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. స్పీకర్ వ్యవస్థను వివాదాల్లోకి లాగడం పై ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయ‌న హిత‌వు ప‌లికారు. శాసన వ్యవస్థను కేసీఆర్ స్వతంత్రంగా పనిచేయనీయడం లేదని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనవసర ప్రతిష్టకు పోకుండా స్వతంత్ర న్యాయ వ్యవస్థను గౌరవించాల‌న్నారు రావుల‌.