ప్రియాంక ఎంగేజ్ మెంట్ రింగ్ ధరెంతో తెలుసా ?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోనాస్ త్వరలోనే పెళ్లాడబోతుంది. ఇప్పటికే రహస్యంగా నిశ్చితార్థం వేడుక కూడా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విమానాశ్రాయంలో ప్రియాంక తన వేలికి ఉన్న రింగుని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఆ సన్నివేశాలు కెమెరాలో బంధించబడ్డాయి. దీంతో అది ఎంగేజ్ మెంట్ రింగియే అని మీడియా మోసింది. ఈ ప్రచారంపై ప్రియాంక నోరు మెదపలేదు.
ఎట్టకేలకు పెళ్లిపై ప్రియాంక నోరు తెరిచింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి ప్రియాంక హాజరైంది. ఈ పార్టీలో ప్రియాంక తన పెళ్లిపై ప్రకటన చేసింది. నిక్ వేలికి తొడిగిన ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
ఈ విలువైన ఉంగర కోసం ప్రముఖ అమెరికన్ జ్యువెలరీ సంస్థ టిఫనీ అండ్ కోకు వెళ్ళిన నిక్ జోనాస్ ఒక రోజంతా ఆ షాప్ లోకి కస్టమర్లు ఎవరూ రాకుండా షాప్ మూసివేయించి మరీ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసి కొన్నాడట. ఈ ఆదివారం ప్రియాంక ముంబైలో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ పార్టీ ఇవ్వనుందని సమాచారమ్.