చైతూ-సమంత సినిమా టైటిల్ ఇదే !

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత తొలిసారి జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే సినిమాని ఘనంగా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇప్పుడీ సినిమా టైటిల్ ఫిక్సయినట్టు సమాచారమ్. ‘మజిలీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

సినిమాలోనూ చైతూ-సామ్ భార్యభర్తలు కనిపించబోతున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలోకి ఓ అమ్మాయి రావడంతో చోటు చేసుకొన్న పరిణామలతో సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. సినిమాలో చై-సామ్ విడిపోతారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చైతూ సవ్యసాచి, శైలాజా రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తైన వెంటనే ‘మజిలీ’ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

‘ఏ మాయ చేశావే’ కోసం తొలిసారి జతకట్టారు చైతూ-సామ్. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘ఆటో నగర్ సూర్య’, ‘మనం’ సినిమాల్లో జంటగా నటించారు. ఐతే, పెళ్లి తర్వాత చై-సామ్ నటించనున్న శివ నిర్వాణ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.