బాలీవుడ్ ‘టెంపర్’ స్పెషల్ టీజర్ చూశారా.. ?

తెలుగు తెరపై ‘టెంపర్’ చూపించాడు ఎన్టీఆర్. కాదు.. కాదు నట విశ్వరూపం చూపించాడు. 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తారక్ ‘టెంపర్’ సూపర్ హిటైనగా నిలిచిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టే పాయింట్’తో అద్భుతంగా సినిమా తీశాడు పూరి. ఇప్పుడీ సినిమా పలు బాషల్లోకి రిమేక్ అవుతోంది.

బాలీవుడ్ రిమేక్ లో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నారు. ‘సింబా’ టైటిల్ తో తెరకెక్కుతోంది. రోహిత్‌ శెట్టి దర్శకుడు. నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ హీరోయిన్ గా పరిచయం కానుంది. సోనూ సూద్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ‘సంబా’ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఓ చక్కటి సందేశం ఇచ్చారు. ‘నువ్వు మహిళలపై జరుగుతున్న దారుణాలను వ్యతిరేకంగా పోరాడకపోతే.. రేపటి బాధితురాలు నీ కుటుంబ సభ్యురాలు అవుతుంది. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయండి. మహిళల్ని వేధించే వారికి శిక్ష తప్పనిసరి’ అని ఈ వీడియోలో పేర్కొన్నారు.

ఈ సినిమాలో రణ్‌వీర్‌ ‘సంగ్రాం భాలేరావ్’ అనే పోలీసు అధికారిగా కనిపించనున్నారు. డిసెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.‌