టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం వాయిదా
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం జరగాల్సిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం సంయుక్త సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పార్టీ అధ్యక్షులు , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య ప్రజాప్రతినిధులంతా స్థానికంగా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి శుక్రవారం నాటి సమావేశాన్న వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి సమావేశం నిర్వహిస్తామని, త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని సిఎం వెల్లడించారు.