‘గీత గోవిందం’ టీంకు అల్లు అర్జున్ పార్టీ !

గీత గోవిందులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. తమ ప్రేమకథతో ప్రేక్షకులకి కిక్కునిస్తున్నారు. వీరిది సింపుల్ లవ్ స్టోరీనే. ఐతే, వినోదాత్మకం ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న పాత్రలో విజయ్ దేవరకొండ మేకోవర్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమా రేంజ్ ని మరింతగా పెంచేసింది. కొంత గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ గా కూడా గీత గోవిందం స్పెషల్ గా నిలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్టలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘గీత గోవిందం’ చిత్రబృందానికి పార్టీ ఇవ్వబోతున్నాడు.

హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ ఉన్న అల్లు అరవింద్ పర్సనల్ ఫామ్ హౌస్ లో రేపు (శనివారం) ఈ స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇక, ఆదివారం సక్సెస్ మీట్ కూడా ప్లాన్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. గీత గోవిందం ని తొలిరోజే చూసేశారు మెగాస్టార్. సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆదివారం సక్సెస్ మీటులో సినిమాపై తన అభిప్రాయాన్ని పబ్లిక్ గా షేర్ చేసుకోనున్నారు. అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు నిర్మించిన చిత్రం కావడంతో ఆయన హ్యాపీగా ఫీలవుతున్నారు