జ్యోతిక చితక్కొట్టింది !

దర్శకుడు బాల సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. రియలిస్టిక్‌ టేకింగ్‌, డార్క్‌ ఎమోషన్స్‌తో సినిమాని తెరకెక్కించడం బాల ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాచియార్‌’. ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సినిమా అనిపించుకొంది. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘ఝాన్సీ’ టైటిల్ తో రిలీజ్ చేశారు. గతంలో తెలుగు సినిమాల్లో గ్లామర్ గా కనిపించి ఆకట్టుకొంది జ్యోతిక. దానికి భిన్నంగా ‘ఝాన్సీ’గా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఝాన్సీ కథేంటీ ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. ఓ లుక్కేద్దాం పదండీ.. !

మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్‌), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్‌ కేసు నమోదు చేస్తారు. ఈ కేసును నిజాయితీ, నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ ( జ్యోతిక) డీల్‌ చేస్తుంది. ఇంతకీ మైనర్ బాలికపై ఎవరు అత్యాచారం జరిపారు? మైనర్ బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? ఈ కేసు దర్యాప్తులో ఝాన్సీకి ఎదురైన సవాళ్లు ఏంటి ? చివరకి మైనర్ బాలికకు జరిగిన అన్యాయానికి ఝాన్సీ ఎలాంటి శిక్ష విధించింది అనేది ట్విస్టులతో బాల స్టయిల్ లో సాగిన కథ ఇది.

బలమైన పాత్రలతో కథ, కథనాలు అల్లుకొన్నాడు బాల. కథను భావోద్వేగమైన చెప్పడంలో ఆయన మార్కు కనిపించింది. ఇక, ఝాన్సీ పాత్రలో జ్యోతిక చితక్కొట్టింది. పవర్ ఫుల్ పోలీసాఫీస్ పాత్రలో జ్యోతిక దూకుడు చూపింది. అన్యాయాన్ని ఎదురించే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. రాశి పాత్రకు ఇవాన సరిగ్గా సరిపోయింది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ నివిడి చాలా తక్కువగా ఉండటం ప్లస్ అయ్యింది. జ్యోతికకు ఇదో స్పెషల్ సినిమాగా మిగిలిపోనుంది. ఐతే, సినిమాలో తమిళ వాసన ఎక్కువైంది.