రణ్-దీప్’ల పెళ్లి కండీషన్స్ ఇవే !
బాలీవుడ్ ప్రేమజంట రణ్ వీర్-దీపికా పదుకొనెలు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 10న వీరి వివాహం జరగబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐతే, ఇప్పుడీ డేటు మరో పది రోజుల వెనక్కి అంటే నవంబర్ 20కి మారినట్టు సమాచారమ్. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. కుటుంబ వేదికగా పెళ్లి వేడుకని నిర్వహించబోతున్నట్టు తెలిసింది. కేవలం 30మంది అతిథులని మాత్రమే ఆహ్వానించబోతున్నారంట.
ఇక, పెళ్లికి విచ్చేయనున్న ఆ కొద్దికొద్దిమందికి కూడా కండీషన్స్ అప్లై అంటున్నారంట. పెళ్లికి సెల్ ఫోన్స్ తీసుకురావొద్దు. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత ఆ ఫోటోలని స్వయంగా రణ్ వీర్, దీపికలు స్వయంగా అతిథులకి షేర్ చేయనున్నారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. పెళ్లి వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని భావిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత నిర్వహించేబోయే రిసెప్షన్ కి స్నేహితులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులని ఆహ్వానించబోతున్నారని చెప్పుకొంటున్నారు.