‘యు-టర్న్’ ట్రైలర్ టాక్


సమంత ఇష్టపడి మరీ.. చేసిన చిత్రం ‘యు-టర్న్’. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యు-టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఒక హత్య నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. సెప్టెంబర్ 13న యు టర్న్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. బార్‌లో నీరసంగా కూర్చొని ఉన్న సమంత సమంతతో ట్రైలర్ మొదలైంది. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా? అబద్ధమా?..’ అంటూ ఆమె తనను తానే ప్రశ్నించుకుంటూ ఉంటే మిగతా ట్రైలర్ మొత్తం నడిచింది. ఓ హత్య కేసు.. దాని ఇన్విస్టిగేషన్, ఆ నేరం చేసింది సమంత అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేయడం ట్రైలర్ లో చూపించారు. ఆది, రవించంద్రన్ అశ్విన్ ఒకట్రెండు బిట్ సీన్స్ లో చూపించారు. భూమిక ప్రతికారం తీర్చుకొనే ఎక్స్ ప్రెషన్ తో కనబడింది. పెద్దగా సస్పెన్స్ మూడ్ లోకి తీసుకెళ్లకుండా.. అసలు కథ ఏంటీ ? అనే ఆసక్తికలిగేలా ట్రైలర్ ని కట్ చేశారు.

ఇక, సెప్టెంబర్ 13న యు-టర్న్ తో పాటుగా సమంత నటించిన తమిళ చిత్రం ‘సీమరాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది గ్రామీణ’ నేపథ్యంతో సాగే చిత్రం. ఈ రెండు డిఫరెంట్ జోనర్ కి చెందిన సినిమాలు కావడంతో.. ఒకేసారి విడుదల కావడం ఇబ్బందేమీ ఉండదని సమంత అంటోంది. ఈ యేడాది సమంతకు బాగా కలిసొచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధిస్తే.. టాలీవుడ్ క్వీన్ ఆఫ్ ది ఇయర్ గా సమంతని నిలవడం ఖాయం.