ఆ మ‌హిళ‌కు పాదాభివంద‌నం చేసిన వాజ్ పెయి..!

రాజ‌కీయంగా ఎంత ఎదిగినా అట‌ల్ జీ నిరాడంబ‌ర‌త‌, ఎదుటివారికి విలువ ఇచ్చిన తీరు న‌భూతో, న‌భ‌విష్య‌తి అని చెప్ప‌వ‌చ్చు. ఉన్న‌త స్థానంలో ఉండి కూడా సామాన్యుల‌కు ఆయ‌న ఇచ్చిన గౌర‌వం ఇప్ప‌టికీ అంద‌రినీ సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తుందని చెప్ప‌డంలో ఏమాత్రం అతివ‌యోక్తిలేదు. స్వామీజీల‌కు, కులాల ప్రాతిప‌దిక‌న పాదాభివంద‌నాలు చేస్తున్న నేటిత‌రం రాజ‌కీయ నాయకులు ఆయ‌నను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఆయ‌న ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఓ సంఘ‌ట‌న ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. మదురై జిల్లాలో 1999లో గ్రామీణ మహిళాభివృద్ధికి పాటుపడుతున్న నిరక్షరాశ్యురాలు చిన్నపిళ్లైకు వాజ్‌పేయి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి పురస్కార్‌’ ప్రదానం చేసింది. ఆ సమయంలో ఆమెకు పురస్కారం అందిస్తూ ఒక్క‌సారిగా వాజ్‌పేయి చిన్నపిళ్లైకు పాదాభివందనం చేశారు. ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం సృష్టించింది.