కలెక్టర్ చెప్పిన దెయ్యం కథ..!
వరంగల్అర్భన్ కలెక్టర్ ఆమ్రపాలి తెలియని వారుండరు. ఆమె ఏం చేసినా ఓ సెన్సేషనే. కలెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలికి దెయ్యమంటే చచ్చేంత భయమట. అయినా సరే దెయ్యం ఉన్న ఇంట్లోనే ఉండాల్సి వస్తుందంటూ ఆమె ఓ ఘోస్ట్ స్టోరీని చెప్పుకొచ్చారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె సరదాగా చెప్పిన ఆ ఘోస్ట్ స్టోరీ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కూడా. వరంగల్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి ఆగస్టు 10తో 133యేళ్లయిందట. తాను నివాసం ఉంటున్న ఆ చారిత్రక భవనం గురించి చెబుతూ జార్జ్ పామర్ అనే ఆయన భార్య వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసందని ఆమె చెప్పారు.
జార్జ్ పామర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తితో కొన్ని నెలలుగా ప్రయత్నించారట ఆమ్రపాలి. నిజాం కాలంలో ఆయనో గొప్ప ఇంజనీర్ అని, ఆమె తెలుసుకున్నారట. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఆ భవనంలో మొదటి అంతస్తులో దెయ్యం ఉదని తనతో చెప్పారని ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత పైకి వెళ్లి చూసి చిందరవందరగా ఉన్న ఆ గదిని సర్ది పెట్టించారట. అయినా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతతతో అక్కడ పడుకోవడానికి సాహసించలేనని ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందట.