ప్రభాస్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం
సోగ్గాడు జగపతి బాబు. శోభన్ బాబు తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. ఫ్యామిలీ హీరో అనిపించుకొన్నాడు. గాయం, అంతం సినిమాలతో తనలోని మాస్ యాంగిల్ ని చూపించారు. ఆయన తెరమీద, తెర వెనక రొమాంటిక్ నే. అన్నింటికంటే మంచి మనసున్నోడు. నిజాయితీపరుడు. స్నేహశీలి. ఐతే, హీరోగా కంటే విలన్ గా ఎక్కువ క్రేజ్ సంపాదించుకొన్నాడు. ప్రస్తుతం అత్యంత డిమాండ్ గల విలన్ గా కొనసాగుతున్నారు.
ఐతే, ఈ తరం యంగ్ హీరోల్లో జగపతి బాబుకు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా..? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్ టీఆర్. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పారు. ప్రభాస్ కి ఫోన్ చేస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ కూడా అంతే అభిమానాన్ని కలిగి వుంటాడు. వారంటే నాకిష్టమన్నారు జగపతి.