ఎంబీబీఎస్ మేనేజ్‌ మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.

ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో క్యాటగిరి బి, సి కోటా సీట్ల భర్తీకి రెండవ విడత నోటిఫికేషన్ విడుదల చేసింది కాళోజీ యూనివ‌ర్శిటీ. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన‌ట్లు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ , సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరి సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 21 వ తేదీన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రం (పి జి ఆర్ ఆర్ సి డి ఈ), ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌ సెంటర్ కు కేటగిరి బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థులు హజరుకావల్సి ఉంటుంది. మరిన్నివివరాల కొరకు www.knruhs.in వెబ్ సైట్ లో చూడవచ్చని అయన తెలిపారు.