బిగ్ బాస్ హౌస్’లో నూతన్ కు గాయాలు.. అసలేమైంది ?
బిగ్ బాస్ హౌస్ నుంచి నూతన్ నాయుడు గాయలతో బయటికొచ్చారు. కెప్టెన్సీ టాస్క్ లో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. అది సీరియస్ అని డాక్టర్లు చెప్పడంతో నూతన్ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ‘పబ్లిక్ కాలర్స్ వర్సెన్ బిగ్‌బాస్ హౌస్ కాల్ సెంటర్ టాస్క్’లో బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చిన ఇంటి సభ్యులుగా కౌశల్, రోల్ రైడాలను నిలిచారు. దీంతో వీరిద్దరికి కెప్టెన్సీ టాక్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది.
గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు టేబుల్స్‌పై రెడ్, గ్రీన్ బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులతో పిరమిడ్ నిర్మించాలి. ఆ క్రమంలో మిగతా హౌస్‌మేట్స్ వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ బాక్సులు, పిరమిడ్ ఆకారంలో పేర్చి కాపాడుకుంటారో వారే విజేతలు. ఇది కెప్టెన్ టాస్క్. ఈ టాస్కుకు పూజ సంచాలకులుగా వ్యవహరిస్తార వ్యవహరించారు.
మొదటి నుంచి కౌశల్ పై అసంతృప్తి ఉన్న.. గణేష్, తనీష్, సామ్రాట్, అమిత్‌లు అందరూ కలిసి కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్‌ను టార్గెట్ చేశారు. ఇక, కౌశల్ స్నేహితుడు నూతన్ రోల్ రైడాని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన భుజానికి గాయమైంది. అది కాస్త సిరీయస్ అవ్వడం.. ఆయన్ని ఇంటి నుంచి బయటకు రావడంతో షో సీరియస్ మూడ్ లోకి వెళ్లిపోయింది. ఇక, ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న నూతన్ నాయుడు, దీప్తి సునయన, రోల్ రైడా, పూజా రామచంద్రన్, శ్యామల, గీతా మాధురి,లో ఎవరు ఎలిమినేట్ కానున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది.