పేపర్ బాయ్.. మాటలు, ముద్దులు !

దర్శకుడు సంపత్ నంది బ్రాండ్ తో వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ కీలక పాత్రల్లో తెరకెక్కింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ మాటలు, ముద్దులతో ఆకట్టుకొన్నాడు పేపర్ బాయ్. అవి యూత్ కు నచ్చేలా ఉన్నాయి.

‘నాకు పరిచయమైంది పుస్తకాలు .. దగ్గరైంది అక్షరాలు’

‘ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది .. అది కనిపించదు .. కానీ బతికేస్తుంది’

‘ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు .. ఊపిరి మార్చుకోవడం’

అనే డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ట్రైలర్ హీరో పుస్తకాల పురుగుగా చూపించారు. దానికి తగ్గట్టుగానే కవితలాంటి లైన్స్ ని చెప్పించారు. ట్రైలర్ లో మాటలు, ముద్దులు ఓకే.. కథ కూడా బాగుంటే.. ఈ చిన్ని సినిమా పెద్ద విజయాన్ని అందుకొనేలా కనిపిస్తోంది.