ప్రియాంక నిశ్చితార్థ వేడుక.. ఫోటోలు !
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పెళ్లి సస్పెన్స్ కు తెరపడింది. ఆమె కొన్నాళ్లుగా ప్రియుడు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అదిపోయింది. దానికి ప్రియాంక చేతివేలికి కనిపిస్తున్న కాస్ట్లీ రింగునే సాక్ష్యం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలో శుక్రవారం ప్రియాంక అత్తా-మామ భారత్ లో దిగిపోయారు. దీంతో ప్రియాంక పెళ్లి విషయంలో ఏదో కీలక ఘట్టం జరగనుందనే ఊహించారు. ఇప్పుడదే జరిగింది. ఇవాళ ఉదయం ముంబైలోని ప్రియాంక నివాసంలో ప్రియాంక-నిక్ ల నిశ్చితార్థ ఘనంగా జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా… కుర్తా పైజమా ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు నిక్. పూర్తిగా హిందూ సంప్రదాయంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇక, ఈ సాయత్రం ముంబైలో ఘనంగా ఎంగేజ్ మెంట్ పార్టీ ఇవ్వబోతున్నారు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా దిగిపోనున్నారు.