వార్ రూమ్ లో రాహుల్ అదే చెప్పారు

ఢిల్లీలో రాహుల్ నేతృత్వంలో వార్ రూంలో జరిగిన సమావేశంలో రఫెల్ డీల్ పై సుదీర్ఘ చర్చ జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ తెలిపారు. మొత్తం 41 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయ‌న అన్నారు. 526 కోట్లకు ఒక్కో విమానం కొనుగోలుకు యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరిందని, అయితే అదే ఒక్కో విమానం కొనుగోలుకోసం ఫ్రాన్స్ వెళ్లి ప్రధాని మోదీ… 16 వందల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయ‌న చెప్పారు. 36 విమానాలకు 41 వేలకోట్ల అధికంగా ఖర్చు చేశార‌ని, ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని రాహుల్ సూచించార‌ని చెప్పారు ఉత్త‌మ్.

HAL తో ఒప్పందం upa దాదాపు దాదాపు పూర్తయినా, మోడీ దాన్ని రద్దు చేసిన విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని రాహుల్ దిశానిర్దేశం చేశార‌న్నారు. కేరళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు చెప్పారాయ‌న‌. తెలంగాణ పీసీసీ తరపున కూడా సాయం చేస్తామ‌ని ఉత్త‌మ్ తెలిపారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద‌న్నారు ఉత్త‌మ్.