చరణ్’కు తుఫాన్ భయం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన అభిమానులకు తుఫాన్ భయం పట్టుకొందట. గతంలో తుఫాన్ చరణ్ కు చేధు అనుభావాన్ని మిగిల్చింది. ‘జంజీర్’ సినిమాతో చరణ్ బాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించింది. ‘జంజీర్’ తెలుగులో ‘తుఫాన్’గా విడుదలైంది. ఇందులో చరణ్ పోలీసు పాత్రలో కనిపించారు. ఐతే, ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత ‘ధృవ’ సినిమాలో మరోసారి పోలీసు పాత్రలో కనిపించాడు చరణ్. ఈసారి సిక్స్ ప్యాక్ బాడీ, కొత్తలుక్ తో సరికొత్త చరణ్ కనిపించాడు. దీనికి తోడు దర్శకుడు సురేంధర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్ ఆకట్టుకొంది. ఫలితంగా ‘ధృవ’ సూపర్ హిట్ అయ్యింది. ఐతే, చరణ్ ముచ్చటగా మూడోసారి పోలీస్ డ్రెస్ వేయబోతున్నాడు. ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి. ఆయన సినిమాల్లో యాక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. పైగా హీరోది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర. యాక్షన్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. ఐతే, అదే సమయంలో ‘తుఫాన్’ రిజల్ట్ ని చూసి భయపడిపోతున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే ధృవ తో చరణ్ పోలీస్ డ్రెస్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. సో.. చరణ్ కు తుఫాన్ భయం పోయినట్టే.. !