సోదరిడితో సమంత ఫైట్

తన సోదరిడితో సమంత ఫైట్ చేస్తుందట. చాలా యేళ్ల క్రిందటే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయట. ఇన్నేళ్లయినా అవి కొనసాగుతూనే ఉన్నాయని తెలిసింది. ఇంతకీ సమంత సోదరుడు ఎవరో తెలుసా ? హీరో సుధీర్ బాబు. సమంత, సుధీర్ బాబు ఇద్దరు ‘ఏం మాయ చేశావె’తో తెరకు పరిచయమయ్యారు. ఇందులో సమంత జెస్సీగా కనిపిస్తే.. ఆయన సోదరుడు జెర్రీగా సుధీర్ బాబు నటించారు. సినిమాలో జెస్సీ కార్తీక్ (నాగ చైతన్య)ని ప్రేమించడం జెర్రీకి అసలు నచ్చదు. దీంతో సోదరి జెస్సీతో గొడవపడుతుంటాడు.

ఇప్పటికీ జెస్సీ, జెర్రీల గొడవ కొనసాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబునే తెలిపారు. ‘చాలా యేళ్లు గడిచాయి. కానీ, జెస్సీ, జెర్రీల మధ్య ఫైట్‌ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ సెప్టెంబరు 13న మళ్లీ ఒకసారి పోటీ పడబోతున్నారు’ అని ట్విట్ చేశారు సుధీర్ బాబు. సమంత ‘యూ టర్న్’ ‌, సుధీర్‌ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. అందుకే ఆ రోజు జెస్సీతో జెర్రీగా అభివర్ణించాడు.

ఇక, శుక్రవారం విడుదలైన సమంత ‘యు-టర్న్’ ట్రైలర్ అదిరిపోయిందని సుధీర్ బాబు కితాబిచ్చాడు. దీనిపై సామ్ క్యూట్‌గా స్పందించారు. ‘అయ్యో అదేం లేదు… మనిద్దరికీ ఆల్‌ ద బెస్ట్‌… థ్యాంక్యూ’ అంటూ ట్వీట్‌ చేశారు సామ్.