‘యు టర్న్’ ట్రైలర్’.. అదే పెద్ద మైనస్సు !
సమంత ఇష్టపడి మరీ.. చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘యు-టర్న్’. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ బాగుందంటూ నాగార్జున, నాగ చైతన్య, రైనా.. నుంచి సుధీర్ బాబు వరకు చాలామందియే పొగిడేశారు. ఐతే, ప్రేక్షకులు మాత్రం ట్రైలర్ బాగుంది. కాకపోతే అందులో సమంత పెద్ద మైనస్సుగా కనిపించిందని చెప్పుకొంటున్నారు. సమంత అంటే సమంత నటన కాదు. ఆమె వాయిస్. ఈ సినిమా కోసం సామ్ తొలిసారి వాయిస్ ఇచ్చింది.
సామ్ వాయిస్ క్యూట్ గా ఉంటుంది. ఐతే, యు టర్న్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కి సమంత పీల వాయిస్ సెట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సమంతకు చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చేది. అది ఆమెకు ఫర్ ఫెక్ట్ గా సూటయ్యేది. యు టర్న్ ట్రైలర్ చూశాక.. సమంత సొంత వాయిస్ కంటే ఆమెకు చిన్మయి వాయిస్ నే బాగా సూటయ్యేది అని చెప్పుకొంటున్నారు. ఐతే, తన పాత్రకు సొంత వాయిస్ ఇవ్వాలనే సామ్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కాకపోతే.. యు టర్న్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో కాకుండా.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ లాంటి సినిమాతో సామ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మొదలెడితే బాగుండేదేమో.. !