కేరళకు సాయం.. ఏ రాష్ట్రం ఎంత ?
కేరళ ప్రజల బాధ వర్ణణారహితం. భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 80శాతం కేరళ వరదనీటిలో మునిగితేలుతుంది. ఇప్పటికే 300మందికి పైగా మృతి చెందారు. రూ. 19,512 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇలాంటి పరిస్థుతుల దృష్ట్యా తోటి రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు సాయంగా రూ. 25కోట్లు ప్రకటించారు. మరో తెలుగు రాష్ట్రం ఏపీ రూ. 10కోట్లు ప్రకటించింది.
కేరళకు సాయం రాష్ట్రాల వారీగా చూస్తే..
* తెలంగాణ ప్రభుత్వం – రూ. 25 కోట్లు
* ఆంధ్రప్రదేశ్ – రూ. 10 కోట్లు
* మహారాష్ట్ర – రూ. 20 కోట్లు
* గుజరాత్ – రూ. 10 కోట్లు
* జార్ఖండ్ – రూ. 5 కోట్లు
* ఒడిశా – రూ. 5 కోట్లు
* బీహార్ – రూ. 10 కోట్లు
* హర్యానా – రూ. 10 కోట్లు
* పంజాబ్ – రూ. 10 కోట్లు
* ఢిల్లీ – రూ. 10 కోట్లు
* తమిళనాడు – రూ. 5 కోట్లు
* కర్ణాటక – రూ. 10 కోట్లు