వరదల్లో మునిగిన సినీ స్టార్స్ ఇల్లులు !

కేరళ ప్రజల కష్టాలు వర్ణణారహితం. భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తున్నాయి. 80 శాతం కేరళ నీటిలోనే ఉంది. పేదలు, పెద్దోళ్లు అనే తేడానే లేదు. అందరు వరదబాదితులే. కాస్ట్లీ ఏరియాల్లో ఉండే సినీ స్టార్ ఇల్లులు నీటిలో మునిగిపోయాయి. నటుడు జయరామ్‌ ఇల్లు నీట మునిగిపోయింది. సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది.

కొచ్చిలో నివాసముంటున్న హీరోయిన్ అనన్య ఇల్లు నీట మునిగిపోయింది. నీట మునిగిన తన ఇంటి ఫోటోను అనన్య తన వాట్సాప్‌లో షేర్ చేసింది. కుటుంబ సభ్యులమంతా చాలా భయభ్రాంతులకుగురయ్యారు. ఐతే, అక్కడి నుంచి శుక్రవారం సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు అనన్య. ప్రస్తుతం అనన్య పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకుంటున్నారు.

మరోవైపు, వరదల్లో మునిగిపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి.. యావత్ దేశం ముందుకొస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, బయటి దేశాలు కేరళకు సాయంగా నిలుస్తున్నారు. చేతనైనా సాయం చేయాలని కేరళ ప్రభుత్వం ప్రతిఒక్కరిని వేడుకుంటోంది.