పాత‌బ‌స్తీలో గ్యాంగ్ వార్..!

ఇద్ద‌రు రౌడీ షీట‌ర్ల మ‌ధ్య గ్యాంగ్ వార్ తో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో అల‌జ‌డి రేగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున ఇద్ద‌రు రౌడీషీట‌ర్లు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి మార‌ణాయుధాల‌తో రెచ్చిపోయారు. తెల్ల‌వారుజామున 12గంట‌ల 20నిమిషాల ప్రాంతంలో న‌డిరోడ్డుపై ఇరు వ‌ర్గాలు రెచ్చిపోయాయి. వాహ‌నాలు వెళుతుండ‌గానే ఒక‌రితో ఒక‌రు స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారు. సినీమాను త‌ల‌పించేలా రెండు గ్యాంగ్ లు త‌న్నుకున్నాయి. ఈ గ్యాంగ్ వార్ లో ముగ్గురికి తీవ్ర గాయాల‌వ‌డంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స్థానికంగా సీసీ కెమెరాల‌లో రికార్డైన దృష్యాల ఆధారంగా అక్క‌డ ఏం జ‌రిగింద‌నే అంశంపై క్లారిటీకీ వ‌చ్చారు పోలీసులు. గ్యాంగ్ వార్ లో నిందితుల‌ను గుర్తించి ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. సంతోష్ న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.